అక్కడ ఎలాంటి లాక్‌డౌన్ విధించకూడదు..

అక్కడ ఎలాంటి లాక్‌డౌన్ విధించకూడదు..
అక్కడ ఎలాంటి లాక్‌డౌన్ విధించకూడదు..

కరోనా మహమ్మారి దెబ్బకు అతలాకుతలమైన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది.. ఆగస్టుతో అన్‌లాక్‌ -3 గడువు ముగుస్తుండటంతో..మరికొన్ని సడలింపులు ఇస్తూ అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను విడుదల చేసింది...కంటైన్‌మెంట్ జోన్‌లకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలకు అవకాశం కల్పించగా.. కంటైన్‌మెంట్‌ జోన్లలోమాత్రం సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో జరిపిన విస్తృతమైన సంప్రదింపుల ఆధారంగా ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం..

ఊహించినట్లుగా మెట్రో ట్రైన్లకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు..దేశవ్యాప్తంగా దశలవారీ విధానంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చింది కేంద్రం. కరోనా వైరస్ విజృంభించిన తర్వాత మొదటి లాక్‌డౌన్ నుంచి మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా పలు నగరాల్లో మెట్రోలు నడవడం లేదు. ఐతే అన్‌లాక్ 4లో మెట్రో సర్వీసులకు అనుమతి ఇవ్వాలని ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రభావంతో ఢిల్లీ మెట్రోకు 1300 కోట్ల నష్టం వాటిల్లింది. మిగతా నగరాల్లోనూ ఇదే పరిస్థితి. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన కేంద్రం మెట్రో సర్వీసులకు ఓకే చెప్పేసింది..

సెప్టెంబర్‌ 21 నుంచి క్రీడా, వినోద, మత, రాజకీయ కార్యకలాపాలను ఇండోర్‌లో జరుపుకొనేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమాలకు కేవలం 100 మందిని మాత్రమే అనుమతిస్తారు... అలాగే ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు..సెప్టెంబర్‌ 21 నుంచి పరిమిత ఆంక్షలతో సామాజిక కార్యక్రమాలకు ఓకే చెప్పేశారు..

సెప్టెంబర్‌ 30 వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు మూసివేసి ఉంటాయి..సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, థియేటర్ల వంచి ప్రదేశాలకు ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదు. హోంశాఖ అనుమతించినవి తప్ప అంతర్జాతీయ ప్రయాణాలపైనా నిషేధం కొనసాగనుంది.

అక్కడ ఎలాంటి లాక్‌డౌన్ విధించకూడదు.. రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలకు కేంద్రం స్పష్టంచేసింది. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా లాక్‌డౌన్లు విధించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, రాష్ట్రం పరిధిలోగానీ, అంతర్రాష్ట్ర ప్రయాణాలకు గానీ ఎలాంటి ఆంక్షలూ ఉండకూడదని రాష్ట్రాలకు సూచించింది. ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండా వ్యక్తులు, సరకు రవాణాకు అనుమతించాలని మరోసారి స్పష్టంచేసింది. 65 ఏళ్లు పైబడిన వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణిలు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఆరోగ్య అవసరాలకు మినహాయిస్తే ఇళ్లలోనే ఉండాలని సూచించింది కేంద్రం. ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్‌ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story