Gujarat: పారా గ్లైడింగ్ లో అపశృతి; గుజరాత్ లో కొరియన్ వాసి మృతి
Gujarat

Gujarat: పారా గ్లైడింగ్ లో అపశృతి; గుజరాత్ లో కొరియన్ వాసి మృతి
విహార యాత్ర కాస్త విషాదయాత్రగా ముగిసిన సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. సరదాగా స్నేహితుడితో కలిసి పారాగ్లైడింగ్‌కి వెళ్లిన ఓ వ్యక్తి అనుహ్యంగా మరణించాడు. దక్షిణ కొరియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి గుజరాత్‌లో పారాగ్లైడింగ్ చేస్తూ ఒక్కసారిగా కిందపడి చనిపోయాడు.
గుజరాత్‌లోని మెహసానా జిల్లా కడి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షిన్ బైయోన్ మూన్ అనే వ్యక్తి పారాగ్లైడింగ్ సమయంలో పారాషూట్ సరిగ్గా పనిచేయకపోవడంతో 50 అడుగుల ఎత్తు నుంచి పడిపోయాడు. అది గమనించిన అతని స్నేహితుడు అపస్మారక స్థితిలో ఉన్న షిన్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆసుపత్రి చేసే సమయానికే పరిస్థితి వికటించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందంటూ పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి కొరియన్ ఎంబసీకి సమాచారం అందించినట్లు తెలిపారు. ఇక అతని మృతదేహాన్ని స్వదేశానికి పంపే దిశగా ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com