రిసెప్షన్‌కు హెలికాప్టర్‌లో వచ్చి..

హెలికాప్టర్‌లో వచ్చాడు ఏమాత్రం సంపాదించి ఉంటాడో.. అయినా ఒకప్పుడు కార్లలో వస్తే అదే గొప్పగా చెప్పుకునే వారు.. ఇప్పుడు ఏకంగా వాళ్లకంటూ ఒక స్పెషల్ హెలికాప్టర్ కొనేసుకోవడమో, అద్దెకు తీసుకోవడమో చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ అన్న కొత్తగా పెళ్లైన చెల్లెల్ని పుట్టింటికి తీసుకువెళ్లడానికి హెలికాప్టర్ అద్దెకు తీసుకుని వచ్చాడు.
తాజాగా గుజరాత్‌కి చెందిన పారిశ్రామిక వేత్త ఓ వివాహ రిసెప్షన్‌కు ప్రైవేట్ హెలికాప్టర్‌లో వచ్చారు. కృష్ణాజిల్లా పర్రచివర గ్రామానికి చెందిన బొండాడ రాఘవేంద్రరావు మేనల్లుడు సందీప్ వివాహం జరిగింది. గుజరాత్‌కు చెందిన కేపీ గ్రూప్ సీఎండీ ఫరూక్ జి.పటేల్, రాఘవేంద్ర రావులు బిజినెస్‌లో పార్ట్‌నర్‌లు. దాంతో ఫరూక్‌ను రాఘవేంద్రరావు మేనల్లుడి రిసెప్షన్‌కు ఆహ్వానించారు.
ఫరూక్ తన కుటుంబసభ్యులతో కలిసి గుజరాత్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పర్రచివర గ్రామానికి చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com