Gujrat: గ్రామంలో సింహాలు...

Gujrat: గ్రామంలో సింహాలు...
గుజరాత్ వీధుల్లో సింహాలు స్వైర విహారం; భయాందోళనలో గ్రామ వాసులు; ధైర్యంగా వీధుల్లో చక్కర్లు కొట్టిన పదుల కొద్దీ సింహాలు..

గ్రామ సింహాలతో తలనొప్పుల తిప్పలు ఎలాగూ తప్పవు... అయితే అకస్మాత్తుగా గ్రామంలోకి సంహాలు ప్రవేసిస్తే పరిస్థితి ఏంటంటారు!! గుజరాత్ లోని ఓ గ్రామస్థులకు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ సింహాల గుంపు గ్రామ వీధుల్లో స్వైర విహారం చేశాయి. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఎనిమిది సంహాలు గ్రామ వీధుల్లో ఠీవిగా తిరుగుతూ ఊరూ వాడా మాదే అన్న చందాన్న రాజసాన్ని ప్రదర్శించాయి. అయితే ఈ ముచ్చట అర్ధరాత్రి చోటుచేసుకోవడంతో గ్రామస్థులెవరూ వీధుల్లో వాటికి తారసపడలేదు. దీంతో అటు సింహరాజాలకు, ఇటు ప్రజలకూ ఏ ఇబ్బందీ లేకుండా పోయింది. ఇక వీధుల్లోని సీసీ కెమెరాల్లోనూ, అటవీ శాఖ అధికారులు తమ ఫోన్ ల్లో బంధించిన ఈ దృశ్యాలను గూజరాత్ అటవీ శాఖ మంత్రి సుశాంత నంద సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. ట్విట్టర్ లో ఇంచుమించు లక్ష మంది ఈ వీడియోకు లైకులు కొట్టేశారు.


Tags

Read MoreRead Less
Next Story