Gun License : పంజాబ్ లో 2 వేల గన్ లైసెన్స్ లు రద్దు

పంజాబ్ ప్రభుత్వం 2వేల గన్ లైసెన్స్ లను రద్దు చేసింది. గన్ కల్చర్ కు వ్యతిరేకంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలిపారు. తుపాకులు కలిగి ఉండటాన్ని, బహిరంగ కార్యక్రమాలకు, మతపరమైన ప్రదేశాలకు, వివాహ వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు ఆయుధాలను తీసుకెళ్లడం, ప్రదర్శించడం నిషేధమని తెలిపారు. రాబోయే రోజుల్లో పోలీసులు వివిధ ప్రాంతాల్లో రాండమ్ చెకింగ్ ను నిర్వహించనున్నట్లు చెప్పారు.
పంజాబ్ లో క్షిణిస్తున్న శాంతి భద్రతలను చక్కదిద్దే చర్యలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు సీఎం. ప్రతిపక్షాల నిరంతర దాడులు, అమృత్ సర్, ఫరీద్ కోట్ లలో లక్ష్యంగా చేసుకున్న హత్యల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పంజాబ్ మొత్తంలో 3 లక్షల 73వేల 53 లైసెన్స్డ్ ఆయుధాలు కలిగి ఉన్నాయని తెలిపారు. తుపాకీ సంస్కృతిని అంతం చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com