ఎక్స్‌రేకి రూ.150, ఎంఆర్‌ఐకి రూ.50..

ఎక్స్‌రేకి రూ.150, ఎంఆర్‌ఐకి రూ.50..
తక్కువ ఖర్చుతో ఖరీదైన స్కానింగ్, ఎంఆర్‌ఐ లాంటి సదుపాయాలను కల్పించనుంది.

అవకాశం వస్తే అందినకాడికి దోచుకుందామనే చూస్తాయి ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు. అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు, వేలల్లో ఫీజులు. సామాన్యుడికి అందనంత ఎత్తులో కార్పొరేట్ వైద్యం. ఈ పరిస్థితుల్లో డయాగ్నస్టిక్ సెంటర్‌కి వెళ్లాలంటేనే భయపడుతుంటారు రోగులు. దేశ రాజధాని ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్ పేద రోగులకు ఊరట కల్పించనుంది. దేశంలోనే అతిచౌకైన డయాగ్నస్టిక్ సెంటర్‌‌ని అందుబాటులోకి తీసుకురానుంది. తక్కువ ఖర్చుతో ఖరీదైన స్కానింగ్, ఎంఆర్‌ఐ లాంటి సదుపాయాలను కల్పించనుంది.

దీంతో పాటు కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరో రెండు నెలల్లో ఈ సెంటర్ ప్రారంభమవుతుందని మేదాంత చైర్మన్, రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ అరవింద్ సింగ్ సోనీ వెల్లడించారు. ఆల్ట్రాసౌండ్ లేదా ఎక్స్‌రేకి రూ.150, ఎంఆర్‌ఐకి రూ.50లు మాత్రమే వసూలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా డయాలసిస్ ప్రక్రియకు రూ.600 వసూలు చేస్తామన్నారు. ఎమ్‌ఆర్ఐ స్కాన్‌కు రూ.800లకు అందించనున్నట్లు తెలిపారు.

అయితే ఈ రాయితీ ఎవరికి ఇవ్వాలనే ఆస్పత్రి వర్గాలు నిర్ణయిస్తాయని వెల్లడించారు. ఇందుకోసం 6 కోట్ల విలువైన డయాగ్నొస్టిక్ యంత్రాలను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చామన్నారు. వీటిలో నాలుగు డయాలసిస్ మెషీన్స్, ఒక్కోఅల్ట్రాసౌండ్, ఎక్స్-రే, ఎంఆర్‌ఐ యంత్రాలు ఉన్నట్లు ప్రకటించారు.

Tags

Next Story