Gurugram: ఖరీదైన కారులో వచ్చి పూల మొక్కలను దొంగలించాడు....

X
By - Chitralekha |1 March 2023 4:52 PM IST
ఢిల్లీలో వింత ఘటన; జీ-20 సభల కోసం పూల మొక్కలు నాటుతున్న ప్రభుత్వం; మొక్కలను ఎత్తుకెళ్లిన బడా బాబు....
జీ 20 సమ్మిట్ కోసం దేశరాజధాని సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతోంది. ఈ మేరకు నగర సుందరీకరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అయితే సుందరీకరణ పనుల నిమిత్తం పూల మొక్కలను తెచ్చి ఎక్కడికక్కడ ఏర్పాటు చేసే క్రమంలో ఓ ప్రభుద్ధుడు చేసిన నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఖరీదైన కారులో వచ్చిన వ్యక్తికి రోడ్డు పక్కనే నాటేందుకు సిద్దంగా ఉంచిన పూల మొక్కలు చూసి కన్ను కుట్టింది. ఇంకెందుకు ఆలస్యం అనుకున్నాడో ఏమో... వెంటనే వాటి పక్కనే కారు ఆపి మరోక వ్యక్తి సహాయంతో చకచకా ఓ పది మొక్కలను కారు డిక్కీలో ఎక్కించుకుని చెక్కేశాడు. అయితే ఈ వ్యవహారమంతా గుర్తుతెలియని వ్యక్తి సెల్ ఫోన్ లో బంధించడంతో దీనిపై చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు ఉపక్రమించారు. సదరు వ్యక్తిని గురుగ్రామ్ కు చెందిన మన్మోహన్(50) గా గుర్తించారు. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించిన పోలీసులు అతడు తీసుకువెళ్లిన పూల మొక్కలతో పాటూ, కారును కూడా సీజ్ చేశారు. ఈ పనికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులపైనా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com