Gurugram: రోడ్డుపై నగ్న ప్రదర్శన... విదేశీయుడి వింత ప్రవర్తన

Gurugram: రోడ్డుపై నగ్న ప్రదర్శన... విదేశీయుడి వింత ప్రవర్తన
X
ఢిల్లీ వీధుల్లో నగ్నంగా పరిగెత్తిన విదేశీయుడు; చెట్టుకు కట్టేసిన స్థానికులు

గురుగ్రామ్ వీధుల్లో నగ్నంగా పరిగెడుతోన్న ఓ విదేశీయుడిని పోలీసులు అదుపులోకి తీుకున్నారు. సెక్టార్ 69లోని తులిప్ చౌక్ వద్ద రోడ్డుపై నగ్నంగా పరిగెడుతూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకునేలోగానే స్థానికులు అతడిని బంధించి చెట్టుకు కట్టేశారు. సదరు వ్యక్తి నైజీరియా దేశానికి చెందిన వాడిగా గుర్తించిన పోలీసులు అతడిని సెక్టార్ 10 లోని పౌర ఆసుపత్రికి తరలించారు. అతడి మానసిక ఆరోగ్యం సరిగ్గానే ఉందని తేలితే కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.

Tags

Next Story