జుట్టు పోషణకు ఉల్లిరసం..

జుట్టు పోషణకు ఉల్లిరసం..
ఉల్లిపాయ రసంతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు మరింత సహాయపడుతుంది.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.. ఉల్లి లేని కూరను ఊహించుకోలేం. అందుకే ఉల్లి ధర ఆకాశాన్నంటినా ఒక కిలో అయినా కొని పొదుపుగా వాడుతుంటారు.. ఉల్లి కూరకి రుచితో పాటు వెంట్రుకల కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తుంది.. డికె పబ్లిషింగ్ హౌస్ రాసిన 'హీలింగ్ ఫుడ్స్' పుస్తకం ప్రకారం, ఉల్లిపాయలలో డజన్ల కొద్దీ ఔషధ రసాయన సమ్మేళనాలు ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్న ఉల్లి ప్రతి రోజూ భోజనంలో తీసుకుంటే మంచిది. జుట్టు పెరుగుదలకు ఉల్లిరసం సరైన ఎంపిక. ఎందుకంటే ఇందులో సల్ఫర్ ఉంటుంది. ఇది వెంట్రుకలు రాలకుండా సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లను బలంగా తయారు చేస్తుంది. ఉల్లిపాయ రసంతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు మరింత సహాయపడుతుంది. దీని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను మరింత ప్రోత్సహిస్తాయి.

జుట్టు పెరుగుదలకు ఇంట్లోనే ఉల్లిపాయ రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

ఒకటి నుండి రెండు ఉల్లిపాయలు తీసుకొని వాటిని గ్రైండ్ చేయాలి. ఆ తరువాత రసాన్ని ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసిన రసాన్ని తీసుకుని తలకు మసాజ్ చేయాలి. ఒక గంట సేపు ఉంచుకుని తరువాత తేలిక పాటి షాంపూతో కడిగేయాలి. దాంతో ఉల్లి పాయ వాసన తొలగిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే వెంట్రుకల కుదుళ్లు గట్టిపడతాయి. ఒకవేళ మీకు ఉల్లి రసం పడుతుందో లేదో చూసుకోవాలంటే కొద్దిగా రసం తీసుకుని చేతి మీద రాసి చూసుకోవాలి. ఏవిధమైన అలెర్జీ కానీ దురద, మంట వంటివి లేకపోతే నిరభ్యంతరంగా ఉల్లి రసాన్ని తలకి పెట్టుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story