HAL Lord Hanuman Row: హనుమంతుడి బొమ్మపై వివాదం

బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా 2023 ఏయిర్ షో సందర్బంగా హిందుస్థాన్ ఎనోరాటిక్స్ లిమిటెడ్ ప్రదర్శించిన ఫైటర్ జెట్ దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. HLFT-42 ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ తోక భాగంపైన హనుమంతుడి బొమ్మను ముద్రించడమే ఈ వివాదానికి కారణమైంది. ఈ మేరకు కేంద్ర మైనింగ్ శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఫైటర్ జెట్ పైన హనుమంతుడి బొమ్మ ముద్రించడంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. భజరంగ్ బిలీని ఈ విధంగా హైలైట్ చేయడం పై హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆయన ట్వీట్ పై విమర్శకులు నిరసన గళాలు ఎక్కుపెట్టారు. భారత సైన్యానికి మతం రంగు ఎలా పులుముతారంటూ విరుచుకుపడుతున్నారు. పైటర్ జెట్ పై హనుమంతుడి బొమ్మ వేయడం సరికాదంటూ పలువురు ట్వీట్ చేశారు. అయితే ఈ వివాదం మరింత ముదరక ముందే HAL సంస్థ నష్ట నివారణా చర్యలు చేపట్టింది. ఫైటర్ జెట్ మీద ముద్రంచిన హనుమంతుడి బొమ్మను తొలగించింది. HAL ప్రవేశ పెట్టిన HLFT-42 ఫైటర్ జెట్ నెక్స్ట్ జెనరేషన్ సూపర్ సోనిక్ ట్రైనర్ గా సేవలు అందించనుంది. ఏరో షో లో తొలిసారి ఈ జెట్ ను ప్రదర్శించింది. ఎయిర్ క్రాఫ్ట్ కాంబాట్ ట్రైనింగ్ లో ఈ ఫైటర్ జెట్ కీలక పాత్ర పోషించబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com