Haryana CM : ఖైదీలకు హరియాణా సీఎం శుభవార్త...!

Haryana CM : ఖైదీలకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ శుభవార్తను తెలిపారు. హరియాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్షలను అనుభవిస్తున్న 250 మంది నిందితులకు క్షమాభిక్ష ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇందులో కొన్ని షరతులున్నాయి. శిక్షాకాలంలో 6 నెలలు, అంతకన్నా తక్కువ కాలం ఉన్న నిందితులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. క్రూరమైన నేరాలకు పాల్పడే దోషులకు ఇది వర్తించదు.
దీనితో పాటుగా పలు సంక్షేమ పథకాలను సీఎం సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2014 నుంచి సుపరిపాలన, పరిపాలనా సంస్కరణలు తీసుకురావడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నామని అన్నారు. అదే స్ఫూర్తితో గత ఏడున్నరేళ్లలో ప్రభుత్వం పరివార్ పెహచాన్ పత్ర వంటి పెద్ద ప్రజా సంక్షేమ పథకాలను అమలుచేసిందని చెప్పుకొచ్చారు.
Haryana CM ML Khattar announces pardoning of sentences of 250 prisoners lodged in different jails of the state or currently on parole, who have a duration of 6 months or less remaining in their sentence. This will not be applicable to convicts of heinous crimes. pic.twitter.com/BpJQS3Ymmc
— ANI (@ANI) November 1, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com