Ruassia-Ukraine War: అతడు నా కొడుకు కాదు.. మోదీ కొడుకు: ఓ తండ్రి భావోద్వేగం

Ruassia-Ukraine War: అతడు నా కొడుకు కాదు.. మోదీ కొడుకు: ఓ తండ్రి భావోద్వేగం
Ruassia-Ukraine War: నా కొడుకును సురక్షితంగా తీసుకువచ్చినందుకు మోదీజీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని అతను చెప్పాడు.

Russia-Ukraine War: బిడ్డల భవిష్యత్ దృష్ట్యా చదువుల నిమిత్తం దూరంగా పంపించక తప్పని పరిస్థితి. అంతా సవ్యంగా జరిగితే బాగానే ఉంటుంది.. ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తే ఎక్కడో చదువుకుంటున్న పిల్లలు, ఉన్న ఊరులో ఉన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతుంటారు.. తన కుమారుడు/కుమార్తె సురక్షితంగా ఉండాలని వేయి దేవుళ్లకి మొక్కుకుంటారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం భయకంపితుల్ని చేస్తోంది. ఉద్యోగాలు చేయడానికో, చదువుకోవడానికో వెళ్లిన వాళ్ల గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

వారిని సురక్షితంగా తీసుకు వచ్చే బాధ్యతను ప్రభుత్వం తన భుజాల మీద వేసుకున్నందుకు తల్లిదండ్రులు కాస్త ధైర్యంగా ఉన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని సుమీలో చిక్కుకుపోయిన తన కుమారుడిని సురక్షితంగా తీసుకు వచ్చినందుకు కశ్మీర్‌కు చెందిన సంజయ్ పండిత కన్నీటిపర్యంతమయ్యాడు. 'తిరిగి వచ్చేసింది మోదీ కుమారుడే తప్ప నా కొడుకు కాదని నేను చెప్పాలనుకుంటున్నాను' అని ఆయన అన్నారు. పండిత మాట్లాడుతూ, సుమీలో ఘర్షణ పరిస్థితుల కారణంగా తన కొడుకు తిరిగి వస్తాడని అనుకోలేదని, ఇప్పుడు వాడిని చూడడం ఆనందంగా ఉందని ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

"సుమీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మాకు ఎటువంటి ఆశలు లేవు. నా కొడుకును సురక్షితంగా తీసుకువచ్చినందుకు మోదీజీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని అతను చెప్పాడు. తమ పిల్లలను చూసేందుకు ఐదు-ఆరు గంటలపాటు తల్లిదండ్రులు ఢిల్లీ విమానాశ్రయం వద్ద వేచి ఉన్నారు. తమ వారిని చూసుకొని భావోద్వేగానికి గురవుతున్నారు ప్రతి ఒక్కరు. ఆనందతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ వారికి మిఠాయిలు తినిపించి, మెడలో పూలమాలలు వేస్తున్నారు.

"భారత్ మాతా కీ జై" మోదీజీకి జై , అంటూ కుటుంబసభ్యులు నినాదాలు చేస్తున్నారు. ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీ నగరం నుండి 674 మంది విద్యార్థులు శుక్రవారం ఢిల్లీలో దిగారు. తిరిగి వచ్చిన వారు అక్కడి భయానక వాతావరణం గురించి, రెండు వారాల నుంచి కొనసాగుతున్న యుద్ధం గురించి అక్కడి నుండి ఎలా బయటపడ్డారో వివరిస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story