Uttar Pradesh: అదేం పిచ్చి.. పాము కరిచిందని కోపంతో చంపి తినేశాడు..

Uttar Pradesh: అదేం పిచ్చి.. పాము కరిచిందని కోపంతో చంపి తినేశాడు..
X
Uttar Pradesh: వినడానికే వింతగా ఉంది.. పాము కరిస్తే పరుగున ఆస్పత్రికి వెళతారు.. అతగాడికి అదేం పిచ్చో..

Uttarpradesh: వినడానికే వింతగా ఉంది.. పాము కరిస్తే పరుగున ఆస్పత్రికి వెళతారు.. అతగాడికి అదేం పిచ్చో.. కరిచిన పాముని పట్టుకుని కోపంతో ఊగిపోయాడు.. కత్తి తీసుకుని ముక్కలు ముక్కలు చేశాడు.. ఆనక ఆ ముక్కల్ని నోట్లో వేసుకుని పరపరా నమిలేశాడు.. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లాలో జరిగింది.

ఈ వింత ఘటన జిల్లాలోని కమాసిన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సియోహత్ గ్రామంలో చోటుచేసుకుంది. మతాబాదల్ సింగ్ (49) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం తన గ్రామంలోని పొలం నుండి తిరిగి వస్తుండగా విషపూరిత పాము కాటు వేసిందని స్థానికులు తెలిపారు. బాధితుడు వైద్య సహాయం కోసం పరుగెత్తడానికి బదులు, దానిని తీసుకొని ముక్కలుగా చేసి మింగేశాడు.

ఒంటి మీద గాయాలు, రక్తపు మరకలు ఉన్న అతడిని చూసి కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు.. విషయం తెలుసుకుని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం అక్కడ నుండి అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం అతని పరిస్థితి ప్రమాదకరంగా లేదని తెలిపారు.

Tags

Next Story