లాలూ ఆరోగ్యం విషమం.. ఆస్పత్రికి తరలింపు

లాలూ ఆరోగ్యం విషమం.. ఆస్పత్రికి తరలింపు
దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది.

దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. దీంతో జైలు అధికారులు ఆయన్ను హుటాహుటిన రాంచీలోని రిమ్స్‌కు తరలించారు. లాలూకి ఇన్ఫెక్షన్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఆయనకు చికిత్స అందిస్తున్నామని... ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. అటు ఈ విషయం తెలుసుకున్న లాలూ భార్య రబ్రీ దేవి, చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్.. ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి రాంచీకి బయల్దేరారు. కాగా అవినీతి కేసుల్లో లాలూ జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story