Uttar Pradesh: చలి చంపేస్తోంది.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న హార్ట్ పేషెంట్లు

Uttar Pradesh: చలి చంపేస్తోంది.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న హార్ట్ పేషెంట్లు
Uttar Pradesh: తీవ్రమైన చలి ఉత్తరప్రదేశ్‌ ప్రజలను మరింత ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రంలో రెడ్ వార్నింగ్ జారీ చేయవలసి వచ్చింది. అతి శీతల ఉష్ణోగ్రతల కారణంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌తో 25 మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Uttar Pradesh: తీవ్రమైన చలి ఉత్తరప్రదేశ్‌ ప్రజలను మరింత ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రంలో రెడ్ వార్నింగ్ జారీ చేయవలసిన పరిస్థితులు తలెత్తాయి అధికారులకు. అతి శీతల ఉష్ణోగ్రతల కారణంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌తో 25 మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపడుతున్నారు. గురువారం కాన్పూర్ జిల్లాలో చలి తీవ్రత కారణంగా అత్యధిక మరణాలు నమోదయ్యాయి. వారిలో 17 మంది ఎటువంటి వైద్య సహాయం అందించకముందే మరణించారని వైద్యులు ధృవీకరించారు.


లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (KGMU) వైద్యులు ప్రకారం, చలిలో రక్తపోటు అకస్మాత్తుగా పెరగడం, రక్తం గడ్డకట్టడం కారణంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లకు గురవుతున్నారని పేర్కొన్నారు.


గురువారం ఒక్కరోజే 700 మంది హృద్రోగులు OPDకి వచ్చినట్లు కార్డియాలజీ ఇన్స్టిట్యూట్ యొక్క కంట్రోల్ రూమ్ నివేదించింది. వీరిలో 41 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అడ్మిట్ చేయాల్సి వచ్చింది.


"ఈ చలిలో వచ్చే గుండెపోటు కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితం కాదు. యుక్తవయస్కుల వారు కూడా గుండెపోటుకు గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని" KGMUలోని అధ్యాపకులు తెలిపారు.


చలి తీవ్రత గుండె ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. చలిలో కరోనరీ ధమనులు కుంచించుకుపోవడంతో గుండె నొప్పి తీవ్రంగా ఉంటుంది. మన శరీర ఉష్ణోగ్రత 95 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే అది గుండె కండరాలకు నష్టం కలిగిస్తుంది.


అందువల్ల, శీతాకాలంలో మీ గురించి, ముఖ్యంగా మీ గుండె ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరుబయట కార్యకలాపాలను నివారించండి. వెచ్చగా దుస్తులు ధరించండి. వీలైనంత ఎక్కువ సమయం ఇంటి లోపల గడపండి అని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు.


కొంత మంది చలికాలంలో వెచ్చదనం కోసం ఆల్కహాల్‌ తీసుకోవాలనుకుంటారు. ఇది మీకు నిజంగా వెచ్చగా అనిపించవచ్చు. కానీ మీరు చలిలో బయట ఉన్నప్పుడు ఇది చాలా ప్రమాదకరం. తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చి, ఆరోగ్యంపై ప్రభావం చూపే ధూమపానం, మద్యపానం వంటి వాటి జోలికి పోకుండా ఉండడమే మంచిదని వైద్యులు వివరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story