Coldwave: ప్రాణాలు తీస్తున్న చలి.. గుండెపోటుతో కొందరు, బ్రెయిన్ స్ట్రోక్‌తో మరికొందరు..

Coldwave: ప్రాణాలు తీస్తున్న చలి.. గుండెపోటుతో కొందరు, బ్రెయిన్ స్ట్రోక్‌తో మరికొందరు..
Coldwave: నార్త్ ఇండియాను చలి వణికిస్తోంది. చలిగాలులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికి రక్తం గడ్డకట్టడంతో గుండెపోటుతో కొందరు, బ్రెయిన్ ​స్ట్రోక్​తో ఇంకొందరు చనిపోయారని డాక్టర్లు తెలిపారు.

Coldwave: నార్త్ ఇండియాను చలి వణికిస్తోంది. చలిగాలులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికి రక్తం గడ్డకట్టడంతో గుండెపోటుతో కొందరు, బ్రెయిన్ ​స్ట్రోక్​తో ఇంకొందరు చనిపోయారని డాక్టర్లు తెలిపారు. ఢిల్లీ,హర్యానా,పంజాబ్,రాజస్థాన్,జమ్మూకాశ్మీర్​లలో కూడా చలి పెరిగింది. పొగమంచు విపరీతంగా కురుస్తోంది. ఢిల్లీలో అయితే హిల్ స్టేషన్ల కంటే తక్కువ టెంపరేచర్ నమోదైంది.మినిమమ్ టెంపరేచర్ 4 డిగ్రీలు నమోదు డెహ్రాడూలో 4, ధర్మశాలలో 5.4,సిమ్లాలో 6.2,ముస్సోరీలో 6.4,నైనిటాల్‌లో 6.5, డిగ్రీల టెంపరేచర్‌ రికార్డ్ అయింది.


ఇక ఢిల్లీలోని అయాన్ నగర్ లో మినిమమ్ టెంపరేచర్ 1.8 డిగ్రీలు, లోధి రోడ్ లో 3.8, రిడ్జ్ లో 3.3 డిగ్రీలకు పడిపోయిందని వాతవరణ శాఖ తెలిపింది.పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 30 విమానాలు ఆలస్యమయ్యాయి. 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.


మరోవైపు రాజస్థాన్​లో నైట్ టెంపరేచర్లు మరింత పడిపోయాయి. ఫతేపూర్​లోని సిక్రిలో 0.7, చురులో ఒక్క డిగ్రీల మినిమమ్ టెంపరేచర్లు రికార్డయ్యాయి. హర్యానాలోని నార్నౌల్ లో 2.5 డిగ్రీలు, పంజాబ్ లోని బాలాచూర్ లో 3.5 డిగ్రీల మినిమమ్ టెంపరేచర్ నమోదైంది. చండీగఢ్‌లో 5 డిగ్రీలు రికార్డయింది. జమ్మూకాశ్మీర్​లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది.శ్రీనగర్​లో మైనస్ 5.5, కుప్వారాలో మైనస్ 5.6, కాజీగుండ్​లో మైనస్​ 5.8 డిగ్రీల మినిమమ్ టెంపరేచర్లు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story