భారీ వర్షాలు.. 17 మంది మృతి

భారీ వర్షాలు.. 17 మంది మృతి
భారీ వర్షాలు ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా భారీ వానలు పడుతున్నాయి.

భారీ వర్షాలు ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా భారీ వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పిడింది. దీంతో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంభవించిన వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ వరదల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర సర్కార్ ఆదివారం తెలిపింది. సుమారు 10,382 ఇళ్ళు దెబ్బతిన్నట్లు పేర్కొంది. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.

Tags

Next Story