Helmet Mandatory : కేంద్రం మరో కొత్త రూల్.. !

Helmet Mandatory : కేంద్రం మరో కొత్త రూల్.. !
X
Helmet Mandatory : ద్విచక్ర వాహనదారులకి ఇది గమనిక.. కేంద్రం మరో కొత్త రూల్ అమలులోకి తీసుకొని వచ్చింది.

Helmet Mandatory : ద్విచక్ర వాహనదారులకి ఇది గమనిక.. కేంద్రం మరో కొత్త రూల్ అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ రూల్ ప్రకారం.. బైక్ పైన చిన్న పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సి ఉంటుంది.. సెంట్రల్ మోటార్ వేహికల్స్ రూల్స్, 1989కు సవరణ చేసి ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది కేంద్రం.. కొత్త నిబంధన ప్రకారం ఎవరైనా నిబంధనలు ఉల్లగించితే రూ. 1,000 జరిమానా లేదా డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తారు.

అలాగే పిల్లవాడితో ప్రయాణించే ఏదైనా ద్విచక్ర వాహనం తప్పనిసరిగా గంటకు గరిష్టంగా 40-కిమీ వేగ పరిమితిలో ప్రయాణించాలి. పిల్లల కోసం కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను ఆదేశించింది కేంద్రం.

ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నప్పుడు పిల్లలకు భద్రత కోసం హెల్మెట్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించింది... ఈ విషయంపై పౌరుల అభిప్రాయాన్ని అడగడానికి అక్టోబర్ 2021 లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Tags

Next Story