మీకు ఓటర్ కార్డు లేదా.. అయితే ఇప్పుడే, ఇలా అప్లై చేసుకోండి..

ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఎంత ముఖ్యమో.. అంతే ముఖ్యమైంది ఓటర్ కార్డు కూడా.. 18 ఏళ్ల వయసు వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య దేశంలో నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటర్ కార్డ్ తప్పనిసరి. మరి ఈ ఓటర్ కార్డ్ పొందడం ఎలా అంటే.. మీ వద్ద ఆధార్ కార్డ్, అడ్రస్ ఫ్రూఫ్ ఉంటే సరిపోతుంది. ముందుగా ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ https://eci.gov.in/ కు వెళ్లాలి. వెబ్‌సైట్‌లో కొంచెం కిందకు వస్తే ఎడమ చేతి వైపున రిజిస్టర్ నౌ టు ఓట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత అప్లై ఫర్ న్యూ ఓటర్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అలాగే రేషన్ కార్డు అప్‌లోడ్ చేయాలి. దాంతో పాటు ఫోటో కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తరువాత అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీ ఈ మెయిల్‌కు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీని సాయంతో మీ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు. ఓటర్ కార్డు నెల రోజుల్లో మీ ఇంటికి వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com