బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పిన శ్రీకాంత్

మన ఇంటి ముచ్చట్ల కంటే పక్కింటి వాళ్ల కబుర్లు వినడం భలే సరదా.. వాళ్లు కొట్టుకుంటున్నారంటే చెవులు మరీ రిక్కబొడుచుకుని విని ఆనందిస్తుంటారు.. గొడవలు, అరుపులు, కేకలు, ఆటలు అన్నీ ఒకే ఇంట్లో ఉంటే అదే బిగ్ బాస్ హౌస్.. మన ఇంట్లో నుంచి వాళ్ల ఇంట్లోకి వెళ్లి వాళ్లేం చేస్తున్నారో తెలుసుకుని ఓటు వేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.. ఆసక్తిగా అనిపించే ఈ షోని నేనూ చూస్తానంటున్నారు నటుడు శ్రీకాంత్.
100 రోజులు ఒకే ఇంట్లో మామూలు విషయం కాదు బాస్ అంటున్నారు శ్రీకాంత్. మన తెలుగు బిగ్‌బాస్ ఒక్కటే కాదు కన్నడ, తమిళ బిగ్‌బాస్‌లను కూడా వరసబెట్టి చూసేస్తారట. అన్ని సీజన్‌లను తిలకించే ఆయనకు 4 సీజన్ విన్నర్ ఎవరో ఒక క్లారిటీకి వచ్చేశారట. టాప్5లో ఉండేది ఎవరో కూడా తెలుసంటున్నారు.
ఆట చూస్తే అర్థం కావట్లా.. ఎవరో తెలియకపోతే ఎలా.. క్రికెట్‌ని ఎంత ఇంట్రస్ట్‌గా చూస్తామో.. బిగ్‌బాస్ కూడా అంతే అని అంటున్నారు. బిగ్‌బాస్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్నవారు కూడా అంతలోనే శత్రువులుగా మారిపోతారు. గెలవడం కోసం ఓడించడం ఎలానో తెలుస్తుంది అంటారు. విభిన్న మనస్తత్వాలు ఉన్నవాళ్లు ఒకే ఇంట్లో ఉండడం అన్నదే పెద్ద టాస్క్. హౌస్‌లోకి వెళ్లిన తరువాత మెంటల్‌గా స్ట్రాంగ్ అవుతారు. హౌస్‌కి వచ్చి పాపులర్ అయిన వాళ్లూ ఉన్నారు.. ఉన్న నేమ్‌ని బ్యాడ్ చేసుకున్నవాళ్లూ ఉన్నారు.
అక్కడకు వెళ్లన తరువాత జీవితంపై ఒక క్లారిటీ వస్తుంది. ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. సీజన్ 4లో విన్నర్ గురించి చెబుతూ ప్రస్తుతానికి అభిజిత్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడని అన్నారు. అఖిల్, సొహైల్, హారిక, అరియానా టాప్ 5లో ఉంటారని అనుకుంటున్నానని అన్నారు. ప్రజెంట్ ట్రెండ్‌ని బట్టి చూస్తే అభిజిత్ బిగ్‌బాస్ విన్నర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనబడుతున్నాయని శ్రీకాంత్ అంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com