బిగ్‌బాస్ 4.. గ్రాండ్ ఫినాలేకు గ్లామర్ బ్యూటీల హొయలు

వంద రోజుల బిగ్‌బాస్ ఆట మరో నాలుగు రోజుల్లో పూర్తవుతుంది. బిగ్‌బాస్ ఫైనల్ విన్నర్ ఎవరూ అన్న ఆసక్తి బుల్లి తెర ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఈ షోకు సంబంధించిన గ్రాండ్ ఫినాలేను భారీగా నిర్వహించేందుకు మాటీవీ సమాయత్తమవుతోంది.
బిగ్ బాస్ 4 చివరి వారంలో ఉన్న గ్రాండ్ ఫైనల్ కోసం కౌంట్‌డౌన్ ఇప్పటికే సెట్ చేయబడింది. వివాదాస్పద రియాలిటీ షో మొదటి ఎపిసోడ్ ప్రసారం అయినప్పటి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిగ్‌బాస్ కోసం ఒక కాలం వెచ్చించి మరీ వార్తలు రాస్తున్నాయి.
చివరి వారంలో ఉన్నందున, మేకర్స్ దీనిని ప్రేక్షకులు మర్చిపోలేని అనుభూతిని కలిగించడానికి సిద్ధంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ మెహ్రీన్ కౌర్, లక్ష్మీ రాయ్, నివేదా పేతురాజ్ వంటి గ్లామర్ తారలతో డ్యాన్స్ ఫెర్మామెన్స్ చేయించనుంది. కాగా అందాల తారల ప్రత్యేక ప్రదర్శనల కోసం లక్షల్లో రెమ్యునరేషన్ చెల్లించడానికి సిద్ధంగా ఉంది.
అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ ఫైనల్ ఎపిసోడ్ నాలుగు గంటల వ్యవధిని కలిగి ఉంటుంది. డిసెంబర్ 20 న ప్రసారం కానున్న గ్రాండ్ ఫినాలే కోసం స్పెషల్ గెస్ట్‌గా సూపర్ స్టార్ మహేష్ కానీ, మెగాస్టార్ చిరంజీవి కానీ వస్తారని వార్తలు వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com