జాతీయం

ఢిల్లీలో బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్

ఢిల్లీలోని రైల్వేస్టేషన్లు, విమానశ్రయాలు, అన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

ఢిల్లీలో బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్
X

ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. దేశంలో ఉన్న ప్రముఖ విమానశ్రయాలు, ముఖ్యమైన సంస్థలు, ఏరోస్పేస్ విభాగాలు, కీలక ప్రాంతాలు, చారిత్రక కట్టడాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆదేశించింది.

మరోవైపు ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం వద్ద పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులు, ఐబీ అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో షా పేలుడు గురించి చర్చించారు. మరోవైపు.. పేలుడు నేపథ్యంలో అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఈ పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించింది. ఇది తప్పకుండా ఉగ్రవాదుల చర్చేనని చెబుతోంది. పశ్చిమాసియా, ఇస్లామిక్ ప్రాంతాల్లో తమ వ్యతిరేక శక్తులు ఈ ఘటన వెనక ఉండొచ్చని అనుమానిస్తోంది. తామంతా సురక్షితంగానే ఉన్నామని రాయబార అధికారులు పేర్కొన్నారు. అటు ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రితో కేంద్ర విదేశాంగ‌శాఖ మంత్రి జైశంక‌ర్‌ ఫోన్‌లో మాట్లాడారు. పేలుడు ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయిల్‌ ఎంబసీకి పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు.

శుక్రవారం సాయంత్రం అబ్దుల్‌ కలాం రోడ్డులోని ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయం పేవ్‌మెంట్‌ దగ్గర జరిగిన పేలుడులో.. మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడిలో ఎవరూ చనిపోలేదు, గాయపడలేదు. తక్కువ తీవ్రత ఉన్న అత్యాధునికి పేలు పదార్ధం ఐఈడీను దుండగులు పేల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ పేలుడు జరిగిన ప్రదేశానికి కేవలం 1.4 కిలోమీటర్ల దూరంలోనే విజయ్ చౌక్ ఉంది.

రిపబ్లిక్ డే కార్యక్రమాల ముగింపును సూచించే బీటింగ్ రిట్రీటక్ కు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు విజయ్ చౌక్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరుగుతుండగానే పేలుడు జరగడంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఢిల్లీలోని రైల్వేస్టేషన్లు, విమానశ్రయాలు, అన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.


Next Story

RELATED STORIES