DSPగా హిమ దాస్ బాధ్యతలు.. !

స్టార్ స్పింటర్ హిమ దాస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా బాధ్యతలు స్వీకరించారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ అందజేశారు. డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సభలో ప్రసంగించిన 21 ఏళ్ల హిమా, తాను చిన్నతనంలోనే పోలీసు అధికారి కావాలని కలలు కన్నట్లుగా వెల్లడించింది. చిన్నప్పుడు దుర్గా పూజ సమయంలో బొమ్మ తుపాకీ పట్టుకుని తిరిగేదానన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ఆటే అన్ని తీసుకొచ్చిందని చెప్పారు. అసోంలో నేరాల నియంత్రణకు కృషి చేస్తానన్నారు.
ఇక 20 ఏళ్ల ఈ అస్సామీ స్టార్ స్పింటర్ హిమ IAAF వరల్డ్ అండర్-20 ఛాంపియన్ షిప్స్‌లో గ్లోబల్ ట్రాక్ ఈవెంట్ ఫార్మాట్‌లో బంగారు పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్‌గా రికార్డు సాధించింది.హిమదాస్ అసోం లోని నాగయోన్ జిల్లాలోని ఢింగ్ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబంలో జన్మించింది. తండ్రిపేరు రొంజిత్ దాస్ ,తల్లి పేరు జొనాలి దాస్.కుటుంబంలోని నలుగురు పిల్లలలో హిమదాస్ చివరిది. ఆమె తండ్రి స్థానికంగా వరి పండించే రైతు. చిన్నతనం నుండీ క్రీడలపై మక్కువ కనిపించే హిందాస్ ప్రపంచ ట్రాక్ ఈవెంట్ ప్రస్థానం అంచలంచలుగా సాగింది.
Thank you Hon'ble Chief Minister @sarbanandsonwal sir for all the motivating and support. https://t.co/cAULk93VVp
— Hima (mon jai) (@HimaDas8) February 26, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com