Assembly election Results: హిమాచల్ ప్రదేశ్ నెక్ టూ నెక్ ఫైట్.. ఫలితాలపై ఉత్కంఠ

Assembly Election Results: హిమాచల్ ప్రదేశ్ నెక్ టూ నెక్ ఫైట్ కొనసాగుతుంది.. నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిమిష నిమిషానికి ఫలితాలు మారుతున్నాయి.. ప్రస్తుతం కాంగ్రెస్ 36 బీజేపీలు 28 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆప్ ఇంకా ఖాతా తెరవలేదు.
ఇక హిమాచల్ ప్రదేశ్ లో గత సంప్రదాయం కొనసాగనుందా? లేక బీజేపీ మరోసారి అధికారం సొంతం చేసుకోనుందా? లేక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? అన్న సస్పెన్స్ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పాటు ఆప్ కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో.. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి రేకెత్తుతోంది.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలతో పాటు అన్ని పార్టీలకు, దేశప్రజలకు ఆసక్తి నెలకొంది. వరస పరాజయాలతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ఎదురుచూస్తోంది. బీజేపీకే ఎడ్జ్ ఉన్నట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com