Himachal Pradesh: కట్నం అడిగిన వరుడు.. వద్దు పొమ్మన్న వధువు

Himachal Pradesh: కట్నం అడిగిన వరుడు.. వద్దు పొమ్మన్న వధువు
Himachal Pradesh: కట్నం తీసుకోవడం నేరం.. అయినా వినేది ఎవరు.. ఇప్పుడు కొత్తగా మాకు కట్నం గిట్నం ఏం వద్దు..

Himachal Pradesh: కట్నం తీసుకోవడం నేరం.. అయినా వినేది ఎవరు.. ఇప్పుడు కొత్తగా మాకు కట్నం గిట్నం ఏం వద్దు.. పెళ్లి మాత్రం బ్రహ్మాండంగా చేయాలి.. అందుకోసం ఎంత ఖర్చుపెట్టాలో, ఎక్కడ చేయాలో, ఎవరెవర్ని ఆహ్వానించాలో చెబుతూ పేద్ద లిస్టే తయారు చేస్తున్నారు. కట్నంకి మించి ఖర్చు పెట్టిస్తున్నారు. మరికొన్ని కేసుల్లో ఆ ఇచ్చేదేదో మీ అమ్మాయికే ఇచ్చుకోండి అని తెలివిగా తప్పించుకుంటున్నారు.. అప్పుడైనా, ఇప్పుడైనా ఆడపిల్లకు పెళ్లంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారమే అవుతోంది. వరుడు కట్నం డిమాండ్ చేసినా తలవంచుకుని తాళి కట్టించుకుంటున్న వాళ్లు కూడా చాలా మందే ఉంటున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి వధువు కట్నం డిమాండ్ చేసాడని అతడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది.

వరుడు భారీ మొత్తంలో కట్న కానుకలు అడిగాడు.. కారు, డబ్బు, బంగారం కట్నంగా డిమాండ్ చేశాడు. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి కట్నం ఎందుకు.. నీకు కావలసినవి నువ్వు కష్టపడి సంపాదించుకో. అంతే కానీ ఆడపిల్ల సొమ్ముకు ఆశపడతావెందుకు అని చెడామడా చీవాట్లు పెట్టింది. సంబంధం మాట్లాడడానికి వచ్చిన పెద్దలు కూడా నోర్మూసుకోవాల్సి వచ్చింది. నేటి మహిళలు దోపిడీకి గురికావడానికి సిద్ధంగా లేరని ఇలాంటి కేసులు రుజువు చేస్తున్నాయి. మహిళలు ఇప్పుడు తమ హక్కులపై అవగాహన కలిగి ఉన్నారు. వాటిని ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసు.

ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో 95 శాతం వివాహాలు కట్నంపైనే నిర్ణయించబడుతున్నాయి. ఈ అధ్యయనం గ్రామీణ ప్రాంతాలలో జరిగింది. భారతీయ జనాభాలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మరొక సర్వే ప్రకారం, వరకట్న కేసులు వరుడి విద్యా స్థాయిని బట్టి పెరుగుతాయి. వరుడు ఎంత చదువుకుంటే అంత కట్నం డిమాండ్ చేస్తాడు. అతని చదువు కారణంగా, వివాహ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అందువల్ల అమ్మాయిల తల్లిదండ్రులు వారికి భారీ మొత్తంలో కట్నం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. సాధారణంగా చాలా కుటుంబాలు కట్నానికి వ్యతిరేకంగా ఉండరు. ఎందుకంటే వారు తమ కుమార్తెలకు వివాహం చేయడానికి ఎప్పుడూ తొందర పడుతుంటారు. చట్టం కూడా ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోదు. ఎందుకంటే వరకట్న నిషేధం అనేది కొన్ని దశాబ్దాల క్రితమే జరిగినా అది ఆచరణ సాద్యం కావట్లేదు.

Tags

Read MoreRead Less
Next Story