Hindenburg Report : అదానీకి ఆర్ఎస్ఎస్ సపోర్ట్‌

Hindenburg Report : అదానీకి ఆర్ఎస్ఎస్ సపోర్ట్‌
అదానీపై దాడి ఏడేళ్ల క్రితమే మెదలైంది

హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో పతనమైన అదానీ గ్రూప్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుగా నిలిచింది. ఇది ఉద్దేశపూర్వక దాడిగా అభివర్ణించింది. ఈ మేరకు సంఘ్‌ అధికారిక వెబ్‌సైట్‌ ఆర్గనైజర్‌లో ఓ కథనం రాసింది.ఈ నివేదికను అనుసరించి ఒక వర్గానికి చెందిన భారతీయులు అదానీకి వ్యతిరేకంగా ప్రతికూల ప్రచారం చేశారని ఆరోపించింది. అదానీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రచారంలో కొన్ని లెప్టిస్ట్‌ వెబ్‌సైట్లు, కొందరు వ్యక్తులు ఉన్నారని ఆరోపించింది. అంతేకాదు అదానీ గ్రూప్‌ విషయంలో జరుగుతున్న దాడి వాస్తవానికి జనవరి 25న ప్రారంభం కాలేదని ఏడేళ్ల క్రితమే ఆస్ట్రేలియాలోనే బీజాలు పడ్డాయని ఆరోపించింది ఆర్గనైజర్‌.

ఆస్ట్రేలియాకు చెందిన బాబ్‌ బ్రౌన్‌ ఫౌండేషన్‌ అనే పర్యావరణ అనుకూల ఎన్జీఓకు చెందిన ఓ వెబ్‌సైట్‌ అదానీని దెబ్బతీసేందుకు ఉద్దేపూర్వకంగా కథనాలు ప్రచురిస్తోందని ఆర్గనైజర్‌ ఆరోపించింది. ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు గనుల ప్రాజెక్టుపై వ్యతిరేకతతో ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌ అదానీకి సంబంధించిన ప్రతి ప్రాజెక్ట్‌ గురించీ ప్రచురిస్తుందని పేర్కొంది. అదానీ సంస్థ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయడమే దీని లక్ష్యమని ఆరోపించింది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన అదానీ గ్రూప్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story