hindenburg research : కొనసాగిన అదానీ షేర్ల పతనం

అదానీ షేర్ల పతనం ఈ రోజు కూడా కొనసాగింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ వేల కోట్లు ఆవిరిఅయ్యాయి. అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ టోటల్ గ్యాస్ 20శాతం క్షిణించాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 18శాతం, అదానీ పవర్, అదానీ విల్మార్ 5శాతం, అదానీ పోర్ట్స్ 0.5శాతం పడిపోయాయి. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ షార్ట్ సెల్లర్ విమర్శలను తిప్పికోట్టడంతో అదానీ గ్రూఫ్ విఫలం అవడంతో సోమవారం కూడా అదానీ గ్రూప్ షేర్లు భారీ పతనాలకు గురయ్యాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ మాత్రం 4 శాతం పెరిగాయి. ప్రారంభలాభాలు 10శాతం కంటే తక్కువగా ఉన్నాయి.
హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రపంచ కుబేరుల్లో మూడవ స్థానంలో ఉన్న అదానీ ఏడవ స్థానానికి పరిమితమయ్యారు. రెండు రోజుల్లోనే అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన.. 20వేల కోట్ల ధనం ఆవిరి అయినట్లుగా తెలుస్తోంది.'హిండెన్ బర్గ్' నివేదిక బోగస్ అని అదానీ గ్రూప్ పేర్కొంది. అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ సింగ్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. హిండెన్ బర్గ్ తప్పుడు నివేదికను ప్రజల్లోకి తీసుకెళ్లిందని అన్నారు. ఇది కేవలం అదానీ గ్రూప్ పై జరిగిన దాడి కాదని, ఆర్థికంగా ఎదుగుతున్న భారతదేశంపై దాడిగా అభివర్ణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com