Haryana : లఖింపూర్ ఖేరీ ఘటన తరహాలో హర్యానాలో మరో ఘటన..కారు ఢీకొట్టి..!

Haryana : జనం సమస్యలు చెప్పుకుంటే ప్రజాప్రతినిధులుగా చేయగలిగితే వారికి న్యాయం చేయాలి.. లేదంటే తమ దారిన తాము వెళ్లిపోవాలి.. కానీ, ఈ మధ్య కొందరు ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే రెచ్చిపోతున్నారు.. లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుండగా.. అలాంటి ఘటనలో హర్యానాలో మరోటి వెలుగు చూసింది.. హర్యానాలోని అంబాలాలో రైతులు ఆందోళనకు దిగారు.. అయితే, స్థానిక ఎంపీ నయిబ్ సింగ్ సైనీ తమ పట్ల క్రూరంగా ప్రవర్తించారని రైతులు ఆరోపిస్తున్నారు.. ఆందోళన చేస్తున్న తమపై ఎంపీ కారును పోనిచ్చారని అంటున్నారు. ఎంపీ కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయని చెప్తున్నారు.. సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగడమే తాము చేసిన పాపమా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.. ఎంపీ నయిబ్ సింగ్ సైనీపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com