Holi : దేశ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము హోళీ శుభాకాంక్షలు

దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇందుకుగాను ట్వీట్ చేశారు. "మీ జీవితంలో ఆనందపు, ఉత్సాహపు రంగులు ఎప్పుడూ వర్షించాలి. మీ అందరికీ సంతోషకరమైన హోళీ శుభాకాంక్షలు" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హోళీ సందర్భంగా పౌరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. "హోళీ పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. హోళీ.. ఆప్యాయత, సౌభ్రాతృత్వం కలగలిసిన పండుగ. శక్తివంతమైన రంగులు.. సామరస్యానికి ప్రతీక. ఈ రంగులు ప్రతీ ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును, నూతన శక్తిని ఇవ్వాలి" అని ముర్ము ట్వీట్ చేశారు. వీరితో పాటే కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దేశ ప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com