Holi : జపాన్ యువతిని వేధించిన యువకులపై పోలీసుల కేసు

జపాన్ రాయబార కార్యాలయం స్పందించి, తమకు సదరు యువతి నుంచి ఎలాంటి ఫిర్యాదును అందలేదని చెప్పింది.

ఢిల్లీలో హోలీ రోజున జపాన్ కు చెందిన యువతిని కొందరు వేధించినట్లు తెలిపారు పోలీసులు. ఓ వీడియోను తాము సోషల్ మీడియాలో కనుగున్నట్లు తెలిపారు ఢిల్లీ పోలీసులు. సదరు యువకులను కనుగొన్నామని వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. జపాన్ ఎంబసీకి లేఖ రాసినట్లు చెప్పారు. జపాన్ రాయబార కార్యాలయం స్పందించి, తమకు సదరు యువతి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పింది. యువతి పర్యాటకురాలని ఇప్పటికే భారత్ నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లినట్లు తెలిపారు.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సదరు జపాన్ పర్యాటకురాలు ఢిల్లీలోని పహార్ గంజ్ లో బస చేసినట్లు తెలిపారు. హోలీలో యువతికి రంగు పూసి, గుడ్డును తలమీద కొట్టి అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులు ఈ ఘటనను అంగీకరించారని తెలిపారు. మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి వీడియోను విశ్లేషిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ సైన్ తెలిపారు.

"పహార్ గంజ్ పోలీస్టేషన్ లో ఏ విదేశీయుడి నుంచి కూడా ఎలాంటి అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదు లేదా కాల్ రాలేదు. బాధిత మహిళను గుర్తించేందుకు, సంఘటనపై ఏవిధమైన ఫిర్యాదు వచ్చినా తెలియజేయాలని జపాన్ రాయబార కార్యాలయానికి ఇమెయిల్ చేశాము" అని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

పట్టుబడిన యువకులపై డీపీ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీడియోను పరిశీలించి నేరస్థులను అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్.. స్వాతి మలివాల్ తెలిపారు. ఈ వ్యవహారంపై సదరు బాలురపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story