Holi : భారత్ మ్యాట్రిమోనీ HOLI వీడియోపై రచ్చ రచ్చ

హోళీ పండుగనాడు చాలా మంది మహిళలు గాయపడుతున్నారని పేర్కొంది. అందుకుగాను వీడియోను రూపొందించింది. అందులో ఓ యువతి ముఖం నిండా రంగు పూయబడి కనిపిస్తుంది. ముఖానికి అంటిన రంగును కడిగేసుకోగా దారుణంగా గాయపడిన మచ్చలు ఉండిపోతాయి. కొన్ని రంగులను నీటితో కడగలేము, అందుకే హోళీ ఆడటం అనే విషయంపై మహిళలు ఆలోచించాలి అని వీడియోను రూపొందించింది భారత మ్యాట్రీమోని. హోళీ పండులో మహిళలకు వేధింపులు జరుగుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే చాలామంది యువతులు హోళీ ఆడటం మానేశారని తెలిపింది. #BeChoosy #Holi #Holi2023 #WomensDay అని హ్యష్ ట్యాగ్స్ ను రిలీజ్ చేసింది.
ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భారత్ మ్యాట్రీమోనీపై విరుచుకుపడుతున్నారు. హోళీ సందర్భంగా ఎంతమంది యువతుల జీవితాలు నాశనమయ్యాయో బయటపెట్టాలని కామెంట్ చేస్తున్నారు. మహిళలు పడుతున్న ఏ విషయంపైనా మాట్లాడని కొన్ని సంస్థలు కేవలం హిందువుల పండుగలపై మాట్లాడుతున్నాయన్నారు. #BoycottBharatMarimony అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు నెటిజన్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com