రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమావేశం

భారత్ బంద్‌తో కేంద్రం స్పందించింది. రైతులను చర్చలకు పిలిచింది.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రైతులను చర్చలకు ఆహ్వానించారు. రైతు సంఘాల ప్రతినిధులతో అమిత్‌షా సమావేశం అయ్యారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈనెల 9న చర్చలు జరగాల్సి ఉన్నా.. రైతుల ఆందోళన మరింత ఉధృతం కావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 13రోజులుగా రైతులు వివిధ రూపాల్లో ఆందోళన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్త బంద్ చేపట్టారు.. రైతులకు మద్దతుగా బీజేపీయేతర పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి.. మరోవైపు ఇప్పటి వరకు ఐదుసార్లు రైతులతో కేంద్రం చర్చలు జరిపినా పురోగతి కనిపించలేదు. చర్చలు జరిపిన ప్రతిసారీ ప్రతిష్టంభనే తప్ప అడుగు కూడా ముందుకు పడలేదు.. ఈ నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com