సీఎం శివుడు.. అధ్యక్షుడు విష్ణువు అయితే కరోనా ఎందుకొస్తుంది!!

మీకు తెలియదేమో.. కానీ కరోనాకి తెలుసు.. సీఎంగా శివుడు.. అధ్యక్షుడిగా విష్ణువు ఉన్నప్పుడు రాకూడదని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'శివ్' (శివరాజ్ సింగ్ చౌహాన్) మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు 'విష్ణు' (విష్ణు దత్ శర్మ) అయినందున కరోనా వైరస్ సంక్రమణ రాష్ట్రాన్ని ఏమీ ఇబ్బంది పెట్టదిని భోపాల్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు.
అదే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ.. అవును మరి సాధారణ మరణాల రేటు కంటే 'ఈ సంవత్సరం జనవరి నుండి మే వరకు రాష్ట్రంలో 3.28 లక్షల కరోనా మరణాలు సంభవించాయి' అని కాంగ్రెస్ పేర్కొంది. అయినప్పటికీ, బిజెపి నాయకులు ప్రజలను మభ్యపెట్టే వ్యాఖ్యలు చేస్తుంటారని పేర్కొంది.
కోవిడ్ ధాటికి 3,500 మంది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా చెప్పారు. కరోనా విజృంభించిన సమయంలో శివరాజ్, విష్ణుదత్ ఎక్కడ ఉన్నారో చెప్పాలి అని అన్నారు. ఆ సమయంలో వారు నిద్రపోయారా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com