TSRTC MD Sajjanar: అలాంటి యాడ్స్‌లో మీరు నటించకూడదు సర్.. : అమితాబ్‌కు సజ్జనార్ ట్వీట్

TSRTC MD Sajjanar: నెలల తరబడి సినిమాల్లో కష్టపడితే రాని డబ్బు ఒక్క ప్రకటనలో చేస్తే వచ్చేస్తుంది. అందుకే సినీ సెలబ్రెటీలు అడ్వర్టైజ్‌మెంట్స్‌లో నటించడానికి రెడీ అయిపోతుంటారు. కొంత మంది మాత్రం వెనుకా ముందు ఆలోచించి ప్రజలకు చెడు చేసే వాటిని అంగీకరించరు. కోట్లు ఇచ్చినా కాదంటారు. అలాంటి వాళ్లు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంటారు. కానీ ద గ్రేట్ లెజండ్ యాక్టర్ బాలీవుడ్ నటుడు అమితాబ్ లాంటి వాళ్లు అలాంటి యాడ్స్‌లో నటించారంటే ఆలోచించవలసిందే.. అదే విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా అమితాబ్‌కు కీలక సూచన చేశారు. ఆమ్వేలాంటి గొలుసుకట్టు సంస్థలకు సహకరించవద్దని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి ఫేక్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దని అభ్యర్థించారు. సెలబ్రెటీలు ఎవరూ ఇలా చేయవద్దని, అమితాబ్ లాంటి స్టార్ హీరోలు ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం సరికాదని ఆయన తెలిపారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. నెల రోజుల క్రితం సానియా మిర్జాను ట్యాగ్ చేసారు. గొలుసుకట్టు సంస్ధల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని సూచించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సజ్జనార్ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటారు.
I humbly request the Super Star Amitabh and other celebrities not to collaborate with fraud companies like Amway which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. @SrBachchan pic.twitter.com/QSLU4VGNQF
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com