చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు సజీవంగా ఉంటుంది?

చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు సజీవంగా ఉంటుంది?
కరోనా వైరస్ మహమ్మారి ఎందరో జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఈ వైరస్ సోకితే చాలు అందరూ ఉన్నా ఎవరూ దగ్గరకు రాలేని పరిస్థితి నెలకొంది.

చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు సజీవంగా ఉంటుంది. ప్రస్తుతం చాలామంది తొలిచేస్తున్న ప్రశ్న .. ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకునేందుకు ఎయిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ గత ఏడాది కాలంగా అధ్యయనం చేసింది. అధ్యయన ఫలితాలను వెల్లడించిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆసక్తికర విషయాలను తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి ఎందరో జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఈ వైరస్ సోకితే చాలు అందరూ ఉన్నా ఎవరూ దగ్గరకు రాలేని పరిస్థితి నెలకొంది. సొంత కుటుంబ సభ్యుడే చనిపోయిన కరోనా భయంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

అయితే చనిపోయిన వారికి గౌరవం ఇచ్చే ఉద్దేశంతో ఎయిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఏడాది కాలంగా అధ్యయనం చేపట్టింది. కరోనాతో చనిపోయిన వ్యక్తి ముక్కు.. శరీరంలో 12 నుంచి 24 గంటల తర్వాత కరోనా వైరస్ బతుకలేదని డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. దాదాపు వందకి పైగా కరోనా శవాలను పరీక్షించారు. మృతదేహాలకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తే నెగటివ్ వచ్చిందని అంటున్నారు డాక్టర్ సుధీర్ గుప్తా.. మృతదేహాల నుంచి ఈ వైరస్ వ్యాప్తి జరగడానికి అవకాశం చాలా తక్కువ అంటున్నారు ఆయన..

ముందస్తు రక్షణలో భాగంగా మృతదేహం ముక్కు రంధ్రాలు శరీరం నుంచి ద్రవాలు శ్రమించే ప్రదేశాలను మూసివేయడం, రోగికి అమర్చిన వివిధ పైపులను శానిటైజర్ చేయాలని సూచించారు. కరోనా పాజిటివ్ తో చనిపోయిన మెడికో లీగల్ కేసులను పరీక్షించడం ద్వారా ఈ విషయాలను గుర్తించినట్లు తెలిపారు.



Tags

Read MoreRead Less
Next Story