Bipin Rawat: అసలేంటి ఈ Mi-17V-5 హెలికాప్టర్? దీని వల్ల గతంలోనూ ప్రమాదాలు జరిగాయా?

Mi-17V-5 (tv5news.in)

Mi-17V-5 (tv5news.in)

Bipin Rawat: ఎమ్‌ఐ హెలికాప్టర్ 17 వి5 లో వీరు ప్రయాణిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.

Bipin Rawat: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, పలువురు ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న విమానం తమిళనాడులో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఎమ్‌ఐ హెలికాప్టర్ 17 వి5 లో వీరు ప్రయాణిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. రష్యాలో తయారు చేసిన ఈ మోడల్ హెలికాప్టర్.. ఇంతకు ముందు కూడా పలు ప్రమాదాలకు కారణమయ్యింది.

Mi-17V-5 హెలికాప్టర్.. మిగతా ఆర్మీ హెలికాప్టర్‌లతో పోలిస్తే చాలా అడ్వాంన్స్‌డ్. ఇండియాలోనే కాదు చాలావరకు దేశాల్లో ఆర్మీ ఈ హెలికాప్టర్‌లను ఉపయోగిస్తోంది. కానీ ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఈ మోడల్ హెలికాప్టర్‌లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయినా ఇతర కార్గో విమానాలతో పోలిస్తే ఇవి తక్కువే అని అధికారులు అంటున్నారు.

Mi-8/17 హెలికాప్టర్‌కు మరికాస్త అడ్వాంన్స్‌డ్ వర్షన్‌లో తయారు చేసిందే Mi-17V-5. రష్యాలోని కాజన్ హెలికాప్టర్స్ సంస్థ ఈ హెలికాప్టర్‌లను తయారు చేస్తోంది. ఈ హెలికాప్టర్‌లు అగ్ని ప్రమాదాల సమయంలో, కాన్వయ్ సమయంలో, పెట్రోలింగ్ సమయంలో.. ఇలా చాలా రకాలుగా ఉపయోగపడతాయి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 2008లో భారతదేశ డిఫెన్స్ అధికారులు 80 Mi-17V-5 హెలికాప్టర్‌లను ఆర్డర్ చేశారు. 2011లో వీటిని తయారు చేయడం ప్రారంభించిన కాజన్ సంస్థ.. 2018లో హెలికాప్టర్‌లను భారతదేశానికి అందించింది. Mi-17V-5.. TV3-117VM లేదా VK-2500 టర్బో ఇంజన్‌తో నడుస్తుంది. TV3-117VM ఇంజన్ ఉన్న హెలికాప్టర్ 2,100hp పవర్‌తో నడుస్తుంది. VK-2500 ఇంజన్ ఉన్న విమానం 2,700hp పవర్‌తో నడుస్తుంది.

Mi-17V-5 హెలికాప్టర్‌లో డిజిటల్ కంట్రోల్ సిస్టమ్ కూడా అమర్చబడి ఉంటుంది. ఇవి 250 వేగంతో 580km నుండి 1,065 km వరకు ప్రయాణించగలుగుతాయి. ఇందులో రెండు ఫ్యుయల్ ట్యాంక్స్ ఉంటాయి. ఈ హెలికాప్టర్ ఒకేసారి 13.000 కిలోల బరువును మోయగలదు. ఏ వాతావరణంలో అయినా ప్రయాణం చేయగలదు.

Mi-17V-5 హెలికాప్టర్‌.. సైన్యానికి ఆయుధాలను తీసుకెళ్లడానికి కూడా ఉపయోగపడుతుంది. మెషిన్ గన్స్, మిసైల్స్, రాకెట్స్ లాంటివి ఇందులో ఒకేసారి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story