అవిసె గింజలతో అద్భుత ప్రయోజనాలు.. పీరియడ్స్ సమస్యలకు..

అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) ఆరోగ్య ప్రయోజనమైన లక్షణాలను అథికంగా కలిగి ఉంటాయి. రోజూ 1 స్పూన్ మోతాదులో తీసుకుంటే జుట్టు రాలకుండా ఉంటుంది. ప్రారంభంలో తినడం కష్టంగా అనిపించినా దాని ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పకుండా తీసుకుంటారు. ఈ గింజలను శుభ్రం చేసి కాస్త వేయించి పొడి చేసుకుంటే మజ్జిగలో కానీ లేదా కారప్పొడి రూపంలో చేసుకుని కానీ తీసుకోవచ్చు. బరువు తగ్గడానికి బాగా పని చేస్తుంది. శరీరానికి అవసరమైన రోజువారీ పోషకాలను అందిస్తుంది.
ఫ్లాక్స్ సీడ్స్ అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇవి ఫైబర్ , ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, లిగ్నన్ ఇతర పోషకాలు, ఖనిజాలతో నిండి ఉంటాయి.
ఈ గింజలు మహిళలు ఎదుర్కునే మెనోపాజ్ సమస్యలను తగ్గిస్తాయి. నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా చూస్తుంది. రుతుస్రావం సమయంలో వచ్చే సమస్యలను పరిష్కరించడంలోనూ, హార్మోన్ల సమతుల్యతను నిర్వహించడంలోనూ సహాయపడతాయి.
ఈ గింజలను పొడి రూపంలో తీసుకోవచ్చు లేదా నూనె రూపంలో వంటకి వాడుకోవచ్చు. మొలకెత్తిన అవిసె గింజలు ప్రోటీన్ మరియు ఒమేగా -3 కొవ్వులను ఎక్కువగా విడుదల చేస్తాయి అని హీలింగ్ ఫుడ్స్ లో పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com