హెచ్‌పీసిఎల్‌లో ఉద్యోగాలు.. పదోతరగతి, డిగ్రీ అర్హతలు
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసిఎల్) సబ్సిడరీ సంస్థ అయిన హెచ్‌పీసిఎల్ బయోప్యూయల్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 51 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో డిప్యూటీ జనరల్ మేనేజర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎన్విరాన్‌మెంటల్ ఆఫీసర్, ల్యాబ్ కెమిస్ట్రీ, బాయిలర్ తదితర పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 51
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా (ఇంజనీరింగ్), బీఎస్సీ, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ ప్రాతిపదికన లేదా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: recruitment@hpclbioufuels.co.in
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2020
వెబ్‌సైట్: http://www.hpclbiofuels.co.in/
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com