Hubili: నర్తకిపై చిల్లరేసి అభాసుపాలయ్యాడు...

Hubili: నర్తకిపై చిల్లరేసి అభాసుపాలయ్యాడు...
X
నర్తకిపై పైసలు గుమ్మరించిన కాంగ్రెస్ కార్యకర్త; కర్ణాటకలోని హుబిలిలో చోటుచేసుకున్న ఘటన; కాంగ్రెస్ నైజమే అంతంటూ మండిపడుతున్న భాజాపా

ఓ వేడుకలో ఏర్పాటు చేసిన గానాభజానాలో ఆడిపాడుతున్న నర్తకిపై నోట్లు ఎగజిమ్ముతూ కెమెరా కంటికి చిక్కిన కాంగ్రెస్ కార్యకర్త ప్రస్తుతం ఆ పార్టీకి కంట్లో నలుసులా మారాడు. కర్ణాటకలోని హుబ్లీలో ఈ ఘటన చోటుచేసుకోగా, సదరు వ్యక్తిని శివశంకర్ హంపన్నగా గుర్తించారు. ఓ వివాహ వేడుకకు హాజరైన శివశంకర్... అక్కడి ఆహూతులను తన నృత్యంతో అలరిస్తున్న నర్తకిపై నోట్లు జిమ్ముతూ హడావిడి చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో... ఇది కాంగ్రెస్ పద్ధతి అంటూ భాజాపా దుమ్మెత్తుపోయడం మొదలుబెట్టింది. అమ్మాయిల మీద నోట్లు జల్లటంపై ఇదేమి పద్ధతి అంటూ భాజాపా మండిపడుతోంది. సదురు వ్యక్తికి డబ్బులపైన గానీ, అమ్మాయిలపైగానీ ఇసుమంతైనా గౌరవం లేదని భాజాపా దుయ్యబెట్టింది. ఇది కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యమైందని వ్యాఖ్యానించింది.

Tags

Next Story