HUID ఉన్న బంగారు నగలే కొనాలి.. కేంద్రం కొత్త రూల్స్

HUID ఉన్న బంగారు నగలే కొనాలి.. కేంద్రం కొత్త రూల్స్
హెచ్‌యూఐడీ కలిగిన బంగారు నగల అమ్మకాలకు మాత్రమే అనుమతి

పెళ్లి లేదంటే ఏదైనా కార్యక్రమం ఉందా? బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే మీకు ఒక అలర్ట్! కేంద్రం కొత్త రూల్స్ అమలులోకి తెస్తోంది. ఇకపై కేవలం HUID ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. హెచ్‌యూఐడీ కలిగిన బంగారు నగల అమ్మకాలకు మాత్రమే అనుమతి ఇస్తుంది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది.

ఇప్పటికే బీఐఎస్ మార్క్‌తో పాటు HUID నెంబర్‌ను కూడా చూసుకోవాల్సిందే. ఈ కొత్త ఐడీలో... మొత్తం 6 డిజిట్ అల్ఫాన్యూమరిక్ సంఖ్యలు ఉంటాయి. ఈ హెచ్‌యూఐడీ నెంబర్ ఉందా? లేదా? అని చెక్ చేసుకోవాలి. బీఐఎస్‌ హాల్ మార్క్ చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకమైన HUID కోడ్ ఇస్తారు. హెచ్‌యూఐడీ అంటే.. హాల్ మార్క్ యూనిక్యూ ఐడెంటిఫికేషన్. ఈ కోడ్ అల్ఫా బెట్, నెంబర్ల కలయికతో ఉంటుంది.

BIS సర్టిఫైడ్ అసయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్‌లో HUIDని ముద్రిస్తారు. దీని వల్ల పారదర్శకత ఉంటుంది. అలాగే వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఉపయోగపడుతుంది. బంగారం కొనుగోలు చేసిన వారు.... జువెలరీ ప్యూరిటీ గురించి ఈ కోడ్ ద్వారా BIS కేర్ యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. ఫేక్ అని తెలితే.. ఆ జువెలరీ షాపుపై BIS కేర్ యాప్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు. హాల్‌మార్క్ జువెలరీ ప్యూరిటీ తెలుసుకోవడానికి HUID ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే మోసాలకు చెక్ పెట్టేందుకు దోహపడుతుందని తెలిపింది. HUID వల్ల ఎలాంటి డేటా సెక్యూరిటీ రిస్క్ ఉండదని తెలిపింది.

Tags

Next Story