పారని ఎత్తుగడ.. ఆస్ట్రేలియాలో ఉద్యోగం గోవింద..

పారని ఎత్తుగడ.. ఆస్ట్రేలియాలో ఉద్యోగం గోవింద..
ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అంటే ఆదాయం బాగానే వస్తుంది పిల్ల సుఖ పడుతుందని కట్న కానుకలు భారీగానే ఇచ్చి

ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అంటే ఆదాయం బాగానే వస్తుంది పిల్ల సుఖ పడుతుందని కట్న కానుకలు భారీగానే ఇచ్చి అమ్మాయిని కట్టబెట్టారు తల్లిదండ్రులు. పెళ్లైన 15 రోజులకే ఫ్లైట్ ఎక్కేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయి అడ్రస్ లేడు అల్లుడు. భార్యని తీసుకెళ్దామన్న ఆలోచనలేదు. ఆర్నెల్లు చూసింది అతడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది భార్య. దాంతో ఉద్యోగం ఊడింది. అతగాడిని తీసుకొచ్చి భార్యకి అప్పగించారు భాగ్యనగర్ పోలీసులు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన బిందుశ్రీ కి హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మందుగుల సురేష్ తో గత ఏడాది ఆగస్టు 6న వివాహం జరిగింది. పెళ్లైన 15 రోజులకు ఆస్ట్రేలియా బయలుదేరిన సురేష్ కొద్ది రోజుల్లో వచ్చి భార్యను తీసుకువెళతానని చెప్పాడు. అప్పటి నుంచి అత్తగారింట్లోనే ఉంటున్న బిందు శ్రీని అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ఈ విషయంపై భర్తకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదు.

దీంతో ఆమె నల్గొండ మహిళా పోలీస్ స్టేషన్లో సీఐ రాజశేఖర్ గౌడ్ ను సంప్రదించారు. ఆయన నల్గొండ ఎస్పీ ఎ.వి.రంగనాథ్ ద్వారా ఆస్ట్రేలియా ఎంబసీ సహకారంతో సురేష్ పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థకు మెయిల్ పెట్టారు. సంస్థ నిర్వాహకులకు సురేష్ నిర్వాకం చెప్పి ఉద్యోగం నుంచి తొలగించేలా చేశారు. అనంతరం సురేష్ భారత్ వచ్చేలా చేశారు. ఈనెల 2న దిల్లీ విమానాశ్రయంలో సీఐ రాజశేఖర్ గౌడ్, విమానాశ్రయ అధికారుల సహకారంతో సురేష్ ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story