చెల్లెలు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న తల్లిని..

చెల్లెలు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న తల్లిని..
మద్యానికి బానిసైన తండ్రి కుటుంబాన్ని పట్టించుకునే వాడు కాదు.

ఓ అన్నగా ఆవేదన చెందాడు.. కన్న తల్లే అయినా క్షమించ లేకపోయాడు.. చెల్లి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న తల్లి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకున్నాడు.. అమ్మ ఎలాగూ చెడిపోయింది.. చెల్లెల్ని కూడా చెడగొట్టాలని చూస్తుంది. తట్టుకోలేకపోయాడు.. తల్లడిల్లిపోయాడు.. అమ్మ మెడకు ఉరి బిగించి చంపేశాడు.. జగద్గిరిగుట్ట ఎల్లమ్మ బండకు చెందిన సురేష్ వృత్తిరిత్యా ఆటో డ్రైవర్. మద్యానికి బానిసైన తండ్రి కుటుంబాన్ని పట్టించుకునే వాడు కాదు. సురేష్.. భార్య, తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

సురేష్ తల్లి మల్లమ్మ (40) చెడు సావాసాలకు అలవాటు పడింది. డబ్బులు సంపాదించాలనే ఆశతో మల్లమ్మ తన మైనర్ కుమార్తెను కూడా ఆ ఊబిలోకి దింపాలని చూసింది. ఈ విషయమై తల్లితో సురేష్ పలుమార్లు గొడవ పడ్డాడు. అయినా ఆమె తీరు మారలేదు. దీంతో తల్లీ కొడుకులకు ఆదివారం తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. సురేష్ ఆగ్రహంతో ఊగిపోయాడు.. అమ్మ మెడకు చీరతో ఉరి బిగించి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Next Story