కోవిడ్ నుంచి కోలుకుంటున్న నగరం.. పూర్తయిన ప్రాజెక్టులకు అధిక డిమాండ్

కోవిడ్ నుంచి కోలుకుంటున్న నగరం.. పూర్తయిన ప్రాజెక్టులకు అధిక డిమాండ్
ఉరుకుల పరుగుల జీవితం, ఉద్యోగ బాధ్యతలు, ఎంతో కొంత పొదుపు చేసి సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆరాటం.

మూడు నెలల క్రితం చతికిలపడ్డ రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంది. కోవిడ్ దెబ్బకు దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి. అధిక శాతం కార్మికులు ఆధారపడే రంగం బిల్డింగ్ పరిశ్రమ. కరోనా కోలుకోలేని దెబ్బ తీసినా పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు భాగ్యనగరం సమాయత్తమవుతోంది. కొనుగోలు దారులు కొత్త ఇళ్ల కోసం అన్వేషణ ప్రారంభిస్తున్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా నగర వాసి త్వరగా బయటపడడానికి ప్రయత్నిస్తాడు..

ఉరుకుల పరుగుల జీవితం, ఉద్యోగ బాధ్యతలు, ఎంతో కొంత పొదుపు చేసి సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆరాటం. నగరవాసిని దృష్టిలో పెట్టుకునే బిల్డర్లు ఆగిపోయిన ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు నడుం బిగించారు. ప్రస్తుతం నిధుల కొరత కూడా పెద్దగా లేదని బిల్డర్లు చెబుతున్నారు. జీతాలల్లో కోత లేనివారు, ఉద్యోగ భద్రత ఉన్న వారు సొంతింటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. మొదటి నుంచి హైదరాబాద్ రియల్టీ ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకునే కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంది.

కొవిడ్ ప్రభావం ఐటీ ఉద్యోగులపై పెద్దగా లేకపోవడంతో బిల్డర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా ఐటీ ఇండస్ట్రీలో కొత్తగా ఉద్యోగాల నియామక ప్రక్రియ కూడా కొనసాగడం మరింత కలిసొచ్చే అంశం. తాజాగా ఐటీ ఉద్యోగులు ఇల్లు, ప్లాట్ల గురించిన ఎంక్వైరీలు చేస్తున్నారని బిల్డర్లు చెబుతున్నారు. మొత్తం మీద హైదరాబాద్ రియల్టీ మార్కెట్ మళ్లీ కోలుకుంటోంది. బ్యాంకులు హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించాయి. పండగ సీజన్ కావడంతో ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నాయి. వడ్డీ రేట్లలో రాయితీని కల్పిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 6.9 శాతం వడ్డీ రేటుతో హోమ్ లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో సొంతింటి కలను నిజం చేసుకోవడానికి నగర జీవులు మొగ్గు చూపుతున్నారు.

Tags

Next Story