Hydroponic Farming: జర్నలిస్ట్ ఉద్యోగాన్ని వదిలి హైడ్రోపోనిక్ ఫార్మింగ్.. ఏడాదికి రూ.70 లక్షల ఆదాయం

Hydroponic Farming: ఇష్టంగా చేస్తున్న జర్నలిస్ట్ ఉద్యోగం.. అయినా ఎందుకో మనసు వ్యవసాయం మీదకు మళ్లింది.. తినే కూరగాయలు, తాగే నీళ్లు అన్నీ కలుషితం.. కనీసం మన చేతుల్లో ఉన్న కొన్నింటికైనా చెక్ పెడదాము అని కూరగాయల పెంపకాన్ని చేపట్టారు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన రామ్‌వీర్ సింగ్.
ఒకరోజు స్నేహితుడి మామయ్య క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని తెలుసుకుని పలకరించడానికి వెళ్లారు రామ్. అతడు ప్రాణాంతక వ్యాధి బారిన పడడానికి కారణం రసాయన ఎరువులతో పండిస్తున్న కూరగాయలు తినడం ద్వారా అని తెలుసుకున్నారు. ఆ విషయం రామ్‌ని కదిలించింది. అలాంటి ప్రమాదాల నుండి తన కుటుంబాన్ని దూరంగా ఉంచాలని నిశ్చయించుకున్నారు.
రామ్‌వీర్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, సేంద్రీయ కూరగాయలను పండించడానికి తన తాత ముత్తాతల నుంచి వచ్చిన కొద్ది పాటి వ్యవసాయ భూమిని ఉపయోగించుకున్నారు. ఆ పొలం బరేలీకి 40 కి.మీ దూరంలో ఉంది. అందులో సేంద్రియ పద్దతిలో కూరగాయలు పండించడం, కుటుంబ అవసరాలకు వాడుకుంటూనే తన ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించడం ప్రారంభించారు.
2017-18లో, అతను వ్యవసాయ సంబంధిత కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లి హైడ్రోపోనిక్స్ వ్యవసాయాన్ని చూశాడు. " దాని గురించి తెలుసుకుని దాని పట్ల ఆకర్షితులయ్యారు. ఈ పద్దతిలో చేస్తున్న వ్యవసాయానికి నేల అవసరం లేదు మరియు తక్కువ చీడపీడలతో పండించవచ్చు. అంతేకాకుండా, మొక్కల పెంపకానికి అవసరమైన దాదాపు 80 శాతం నీటిని ఇది ఆదా చేస్తుంది అని ఆయన తెలుసుకున్నారు.
రాంవీర్ మరికొన్ని రోజులు అక్కడే ఉండి రైతుల నుండి వ్యవసాయ పద్ధతులను నేర్చుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత, అతను ఇంట్లో వ్యవసాయ సాంకేతికతతో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అతనికి హైడ్రోపోనిక్స్ పట్ల ఉన్న మక్కువ, ప్రేమ ఈ రోజు తన మూడంతస్తుల ఇంటిని హైడ్రోపోనిక్స్ ఫామ్‌గా మార్చేలా చేసింది. దాని ద్వారా ఆదాయం కూడా లక్షల్లో వస్తోంది.
10,000 మొక్కలు ఉన్న ఇల్లు
రామ్‌వీర్.. న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ (NFT) మరియు డీప్ ఫ్లో టెక్నిక్ (DFT)ని ఉపయోగించి 750 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో 10,000 మొక్కలను పెంచుతున్నారు.
బెండకాయ, మిరపకాయలు, క్యాప్సికం, పొట్లకాయ, టమోటాలు, క్యాలీఫ్లవర్, బచ్చలికూర, క్యాబేజీ, స్ట్రాబెర్రీ, మెంతులు మరియు పచ్చి బఠానీలను పండిస్తున్నాడు. ఆయా కాలాల్లో పండే కూరగాయలు అన్నింటినీ హైడ్రోపోనిక్స్‌తో పండిస్తారు.
ఈ వ్యవస్థ PVC పైపులను ఉపయోగించి రూపొందించబడింది. మెగ్నీషియం, రాగి, భాస్వరం, నైట్రోజన్, జింక్ వంటి 16 పోషకాలను ప్రవహించే నీటిలో వాటిని ప్రవేశపెట్టడం ద్వారా మొక్కలకు చేరుకునేలా ఈ అమరిక ఉంటుంది. ఈ పద్ధతి వల్ల 90 శాతం నీటి వినియోగం ఆదా అవుతుంది'' అని ఆయన వివరించారు.
సేంద్రీయ వ్యవసాయం కంటే హైడ్రోపోనిక్ ఫార్మింగ్ టెక్నిక్ ఆరోగ్యకరమైనది, మెరుగైనది అని రామ్‌వీర్ చెబుతారు. "హైడ్రోపోనిక్స్ వ్యవసాయంలో పండించే కూరగాయలు పోషకాలను బాగా గ్రహించగలవని అంటారు. అంతేకాకుండా, హైడ్రోపోనిక్స్ వ్యవసాయం హానికరమైన రసాయనాల నుండి దూరంగా ఉంచుతుంది అని చెప్పారు.
అతను తన ఇంటి బాల్కనీలో ఏర్పాటు చేసిన హైడ్రోఫోనిక్ ప్లాంట్ అతిధులను ఆకర్షించింది. "చాలా మంది తమ ఇళ్లలో ఆ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయాలని అడగడంతో దాదాపు 10 మంది వ్యక్తులకు హైడ్రోపోనిక్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లు చెప్పారు.
రామ్‌వీర్ వింపా ఆర్గానిక్ మరియు హైడ్రోపోనిక్స్ కంపెనీని స్థాపించాడు. దాని ద్వారా అతనికి సంవత్సరానికి రూ.70 లక్షల ఆదాయం వస్తుంది. ఇటీవల, బీహార్‌లోని ఒక రైతు కోసం రామ్‌వీర్ ఏర్పాటు చేసిన హైడ్రోపోనిక్స్ ఇన్‌స్టాలేషన్ అతని ఉత్పత్తులను వరదల నుండి కాపాడింది.
''వరదల సమయంలో చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను కోల్పోయారు. కానీ నేను హైడ్రోపోనిక్స్ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల వరదల సమయంలో రక్షించబడ్డాను, "అని సంజయ్ అనే మరో రైతు చెప్పారు.
కూరగాయల సగటు అమ్మకపు ధర పెరిగింది కిలో రూ. 30-40 మధ్య ఉంటుంది. కానీ కొరత వల్ల కిలో ధర రూ. 80కి పెరిగింది, దాని వల్ల నేను లాభపడ్డాను" అని సంజయ్ చెప్పారు. మట్టితో పనిలేకుండా, హానికరమైన ఎరువులు వాడకుండా రామ్‌వీర్ చేస్తున్న హైడ్రోఫోనిక్ వ్యవసాయం పట్ల పలువురు ఆకర్షితులవుతున్నారు. ఈ పద్దతిలో చేస్తున్న వ్యవసాయం గురించి మరింత ప్రచారం జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com