'నానీ'లో నాకు నచ్చింది..: అదితీరావు హైదరీ

నానీలో నాకు నచ్చింది..: అదితీరావు హైదరీ
నటి అదితీరావు హైదరీ.. నానీ 25వ చిత్రంలో 'వి' లో అతడికి జంటగా నటించి మంచి మార్కులు కొట్టేసింది

సమ్మోహనం, అంతరిక్షం వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అదితీరావు హైదరీ.. నానీ 25వ చిత్రంలో 'వి' లో అతడికి జంటగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.. నానీ గురించి మాట్లాడుతూ.. అద్భుతమైన వ్యక్తి.. స్టార్ ఇమేజ్ అస్సలు చూపించడు.. సౌమ్యంగా ఉంటాడు.. అందుకే నాకిష్టమైన సహనటుడు నానీ అని చెప్పుకొచ్చింది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'వి' చిత్రం ప్రేక్షకుల మన్నలను పొందుతోంది.

లాక్టౌన్ సమయంలో తాను పెయింటింగ్ వేయడం నేర్చుకున్నానని చెప్పింది. ఇప్పుడు నేను ఏ వస్తువునైనా అందంగా మార్చగలను అని తను నేర్చుకున్న కళ గురించి పంచుకుంది. తన అభిరుచులను గురించి చెబుతూ.. వంట చేయడం ఇష్టం.. రణ్‌బీర్‌ కపూర్, ఇలియానా, దీపికా పదుకొణె నటించిన బర్ఫీ సినిమా అంటే చాలా ఇష్టం.. అందుకే ఆ సినిమాను చాలా సార్లు చూశా.. దర్శకుడు మణిరత్నం తీసే ప్రతి సినిమాలోనూ నటించాలని ఉంది. ఓ వైఫల్యం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. కింద పడ్డా మళ్లీ లేచి పరిగెట్టడం ప్రారంభించాలి. అప్పుడే గెలుపు మీ సొంతమవుతుంది అని వివరించారు. మీరు ఇతరుల పట్ల చూపే దయ, సహనం మిమ్మల్ని మరో మెట్టు పైన నిలబెడుతుంది అని చెప్పుకొచ్చారు అదితి.

Tags

Next Story