Tina Dabi: వయసులో 13 ఏళ్ళు పెద్ద.. రెండో పెళ్లి చేసుకోబోతున్న ఐఏఎస్ ఆఫీసర్ ...!

IAS Office Tine Dabi: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి టీనా దాబీ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. 2013 బ్యాచ్‌కి చెందిన IAS అధికారి ప్రదీప్ గవాండేతో ఆమె జీవితాన్ని పంచుకోబోతున్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని తెలుపుతూ వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దాబీ 2015లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్‌గా ఉండి వార్తల్లో నిలిచారు. ఆమెతో పాటు అదే సంవత్సరం IAS పరీక్షల్లో రెండవ స్థానంలో నిలిచిన అథర్ అమీర్ ఉల్ షఫీ ఖాన్ ను ఆమె వివాహం చేసుకున్నారు. అయిదేళ్లు కలిసి ఉన్న ఆ జంట మనస్పర్ధల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నారు.
దాబీని వివాహం చేసుకోనున్న ప్రదీప్ గవాండే ఐఏఎస్ అధికారి కాకముందు డాక్టర్. ప్రస్తుతం, అతను రాజస్థాన్‌లోని ఆర్కియాలజీ & మ్యూజియమ్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అతను టీనా కంటే 13 ఏళ్లు పెద్దవాడని సమాచారం.
మహారాష్ట్రకు చెందిన గవాండేకు గతంలోనే వివాహమైంది. ప్రదీప్, టీనాలు నాలుగు నెలల క్రితం కలుసుకున్నారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు.. ఒకరి భావాలు మరొకరు పంచుకున్నారు. కలిసి జీవించాలనుకున్నారు. వివాహంతో ఒక్కటవనున్నారు.
2015లో, ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన దళిత సమాజానికి చెందిన మొదటి వ్యక్తిగా టీనా దాబీ నిలిచారు. దాబీ, ఖాన్ 2016లో ఫేస్‌బుక్ ద్వారా కలుసుకున్నారు. 2018లో తాము వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ జంట 2020లో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com