Tina Dabi wedding : రెండో పెళ్లి చేసుకున్న IAS టాపర్ టీనా దాబీ..!

Tina Dabi wedding : ఐఏఎస్ అధికారిణి టీనా దాబి రెండో పెళ్లి చేసుకున్నారు.. ఐఏఎస్ ప్రదీప్ గవాండేతో ఆమెకి రెండో వివాహం జరిగింది. ఈ జంట శుక్రవారం రోజున అత్యంత సన్నిహితులు, బంధువులు సమక్షంలో ఒక్కటయింది. మరాఠీ సంప్రదాయం ప్రకారం వీరి జరిగింది. వివాహ సమయంలో టీనా దాబి తెలుపు, బంగారు రంగు చీర ధరించగా, ప్రదీప్ కూడా తెల్లటి కుర్తా-పైజామాలో కనిపించాడు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
2016 రాజస్థాన్ కేడర్‌కు చెందిన టీనా దాబీ, 2013 కేడర్‌కు చెందిన గవాండే ప్రస్తుతం జైపూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. టీనా దాబీ ప్రస్తుతం రాజస్థాన్ ప్రభుత్వానికి ఆర్థిక (పన్ను) జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. గవాండే రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆర్కియాలజీ మరియు మ్యూజియమ్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడగా, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ఏడాదిపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గత నెల మార్చి నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఈ జంట సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 29 ఏళ్ల టీనా దాబీ రెండోసారి పెళ్లి చేసుకోనుండగా, గవాండేకి ఇది మొదటి వివాహం.
దాబీకి గతంలో కాశ్మీర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అథర్ అమీర్ ఉల్ షఫీ ఖాన్‌తో వివాహం జరిగింది, అయితే వారి వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ జంటకు జైపూర్‌లోని ఫ్యామిలీ కోర్టు 2021 ఆగస్టులో విడాకులు మంజూరు చేసింది. ఇప్పుడు టీనా తనకంటే 13 ఏళ్లు పెద్దవాడైన ప్రదీప్‌ని పెళ్లి చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com