IBM: 3,900 మంది ఉద్యోగుల పై వేటు...

ప్రముఖ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తీసివేయడం కొంత కాలంగా జరుగుతుంది. దీంతో ఏ కంపెనీ ఎప్పుడు ఉద్యోగులను తీసి వేస్తుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడం కోసం వారి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇటీవలే అమెజాన్, ట్విట్టర్, మెటా లాంటి దిగ్గజ కంపెనీలు సైతం ఆపరేషన్ కాస్ట్ తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు అదే జాబితాలో మరో టెక్ దిగ్గజ కంపెనీ ఐబీఎం కూడా చేరింది. తాజాగా 3,900 మంది ఉద్యోగులను తీసేయనున్నట్లు వెల్లడించింది. అసెట్ డివెస్ట్ మెంట్ లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఐబీఎం స్పష్టం చేసింది. అయితే క్లయింట్ ఫేసింగ్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ నియామకాల కోసం మాత్రం తాము కట్టుబడి ఉన్నట్టు ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ చెప్పారు. దీంతో ఆ కంపెనీ ఉద్యోగుల్లో గుబులు మెదలైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com