రోగనిరోధక శక్తిని పెంచి.. బరువుని తగ్గించే అశ్వగంధ టీ..

హెర్బల్ టీ వాడకం ఎప్పటి నుంచో ఉన్నదే అయినా.. ఈ కరోనా సీజన్ లో ఈ టీకి మరింత ప్రాచుర్యం పెరిగింది.. ఔషధ మూలికలతో తయారు చేసిన హెర్బల్ టీ ఆరోగ్యానికి, సీజనల్ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. కొన్ని శక్తివంతమైన వనమూలికలను హెర్బల్ టీ తయారీలో ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పటి వరకు చూసిన హెర్బల్ టీలకు భిన్నంగా ఈ అశ్వగంధ హెర్బల్ టీ ఉంటుంది. పసుపు, అశ్వగంధ పొడిని సమభాగాలుగా తీసుకుని తయారు చేసిన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, బరువును కూడా తగ్గిస్తుంది.
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు దీర్ఘకాలిక వ్యాధులను నివారించగలదు. దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. మరో ఆయుర్వేద రత్నం అశ్వగంధ.. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, నిద్ర బాగా పట్టడానికి సహాయపడుతుంది. హార్మోన్ల పనితీరును మెరుగుపరచడంలో కూడా అశ్వగంధ సహాయపడుతుంది. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుంది. అశ్వగంధ ఆయుర్వేదం యొక్క అత్యంత విలువైన మూలికలలో ఒకటి.
ఈ హెర్బల్ టీలో తక్కువ కేలరీలు ఉంటాయి కనుక ఇది మీకు అదనపు కేలరీలను అందించదు. ఈ టీ మీ జీవక్రియను సహజంగా పెంచడానికి సహాయపడుతుంది. ఇప్పుడు, వీటిని ఉపయోగించి కప్పు టీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
ఒక పాత్రలో 1 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ అశ్వగంధ పొడి వేసి 5 నిమిషాలు సిమ్ లో మరగబెట్టాలి. మరిగిన తరువాత 1 స్పూన్ పటిక బెల్లం పొడికాని, బెల్లం పొడి కాని వేయాలి. లేదంటే వడకట్టిన తరువాత 1 స్పూన్ తేనె వేసుకుని కూడా వేడిగా తాగొచ్చు. ప్రతి రోజు 1 కప్పు అశ్వగంధ టీ తీసుకోవడం అలవాటు చేసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి, శరీర బరువును తగ్గిస్తుంది. శరీరంలో అదనంగా పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది అశ్వగంధ టీ..
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com