పెరుగుతున్న కరోనా కేసులు..

కరోనా గురించి మర్చిపోయి మునుపటిలా మన పనుల్లో మునిగిపోదామనుకుంటే మళ్లీ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.. రోజుకో తీరుగా కోవిడ్ కేసుల సంఖ్య నమోదవుతోంది. కేరళలో శనివారం గరిష్ట స్థాయిలో కరోనా కేసులు నమోదవడం ఆ రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అంతకుముందు రోజుకు 800 కేసులు వస్తే ఆ ఒక్కరోజు 1,050 కేసులు నమోదయ్యాయి. మలప్పురంలో 826, ఎర్నాకులం 729, కోజికోడ్ 684, త్రిస్సూర్ 594, కొల్లం 589 పాలక్కాడ్ 547, కన్నూర్ 435, అలపుజ 414, కొట్టాయం 389, పతనమిట్ట 329, కాసరగోడ్ 224, ఇడుక్కి 107 కేసులు ఉన్నాయి. కేరళ మరణాల సంఖ్య 656 కు పెరిగింది, సెప్టెంబర్ 3 మరియు 25 మధ్య జరిగిన మరో 21 మరణాలు ఈ జాబితాలో చేర్చబడ్డాయి.
చెన్నైలో వరుసగా మూడవ రోజు 1,000 కి పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,187 మంది సంక్రమణకు పాజిటివ్ పరీక్షలు చేయగా, నగరంలో 23 మంది మరణించారు. కోయంబత్తూర్‌లో 656 కొత్త కేసులు ఉన్నాయి. మధుమేహం మరియు హైపోథైరాయిడిజంతో చెన్నైకి చెందిన 34 ఏళ్ల మహిళ రావివ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 24 న జాయినయ్యింది. ఒక రోజు వ్యవధిలో కోవిడ్ -19 న్యుమోనియా, శ్వాసకోశ వ్యాధులు ఒకేసారి దాడి చేయడంతో మరణించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com